శ్రీవారి దర్శనం టికెట్ల పేరిట అధికమొత్తంలో వసూలు.... చర్యలు తీసుకున్న టీటీడీ

25-07-2021 Sun 18:37
  • దర్శనం టికెట్ల పేరిట వ్యాపారం
  • చెన్నైకి చెందిన రేవతి పద్మావతి ట్రావెల్స్ పై చర్యలు
  • ఫిర్యాదు చేసిన టీటీడీ విజిలెన్స్ అధికారులు
  • కేసు నమోదు
TTD complains against a private travels

శ్రీవారి దర్శనం టికెట్ల పేరిట వ్యాపారం చేసేవారిని ఉపేక్షించబోమని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పష్టం చేసింది. శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి అధికమొత్తంలో వసూలు చేస్తున్న ఓ ట్రావెల్స్ సంస్థపై టీటీడీ చర్యలు తీసుకుంది. చెన్నైకి చెందిన రేవతి పద్మావతి ట్రావెల్స్ పై టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేయగా, సదరు సంస్థపై కేసు నమోదైంది. దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనం టికెట్లను ఆన్ లైన్ లోనే కొనుగోలు చేయాలని సూచించింది.

కాగా, శ్రీవారి దర్శనాల సంఖ్యను ఇప్పట్లో పెంచబోమని టీటీడీ ఇంతకుముందే స్పష్టం చేసింది. ఆన్ లైన్ టోకెన్లు లేనివారికి తిరుమల ప్రవేశం లేదని ఈవో ఇప్పటికే ఓ ప్రకటనలో తెలిపారు.