ఏపీకి మరో విడత కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల రాక

24-07-2021 Sat 21:07
  • ఏపీలో కరోనా వ్యాక్సిన్ కొరత
  • తాజాగా 11.76 లక్షల వ్యాక్సిన్ డోసులు రాక
  • సీరం ఇన్ స్టిట్యూట్ నుంచి 98 బాక్సుల్లో రవాణా 
  • త్వరలో జిల్లాలకు తరలింపు
Another allocation of Covishield corona vaccine doses arrives AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న కరోనా వ్యాక్సిన్ కొరత తీరనుంది. ఏపీకి మరో విడత కరోనా వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. పూణేలోని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి రాష్ట్రానికి తాజాగా 11.76 లక్షల కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. వీటిని 98 బాక్సుల్లో ఉంచి విమానం ద్వారా గన్నవరం ఎయిర్ పోర్టుకు రవాణా చేశారు. ఈ వ్యాక్సిన్ డోసులను గన్నవరంలోని ప్రధాన స్టోరేజి యూనిట్ కు తరలించనున్నారు. త్వరలోనే ఈ వ్యాక్సిన్ డోసులను జిల్లాలకు పంపిస్తారు.