నానీతో ఒక్క సీన్ అయినా చేయాలనుందట!

24-07-2021 Sat 19:28
  • 'కేరాఫ్ కంచెరపాలెం'తో గుర్తింపు
  • అదే బాటలో 'అర్థ శతాబ్దం'  
  • 'నారప్ప'తో పెరిగిన క్రేజ్
Karthik Rathnam wants to act with Nani

ఇప్పుడు ఎక్కడ చూసినా కార్తీక్ రత్నం పేరు వినిపిస్తోంది. మొదటి నుంచి కూడా కార్తీక్ రత్నం విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో రూపొందే సినిమాల కోసం ఆయనను తీసుకుంటున్నారు. ఆ తరహా పాత్రలు ఆయనకు బాగా నప్పుతుండటమే అందుకు కారణం.

కార్తీక్ రత్నం అనగానే 'కేరాఫ్ కంచరపాలెం' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమా హిట్ కావడమే కాకుండా, ఆయనకి మంచి ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఇటీవల వచ్చిన 'అర్థ శతాబ్దం' కూడా ఆయనకి మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ రెండు సినిమాల వల్లనే ఆయనకు 'నారప్ప' సినిమాలో అవకాశం వచ్చింది.

ఈ సినిమాలో ఆయన వెంకటేశ్ పెద్దకొడుకు 'మునికన్న' పాత్రలో మెప్పించాడు. కథ అంతా కూడా ఆయన పాత్ర చుట్టూ తిరగడం వలన ఒక్క సారిగా క్రేజ్ పెరిగిపోయింది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ , "నాని గారి నటన అంటే నాకు చాలా ఇష్టం .. ఆయనతో కలిసి ఒక్క సీన్ చేసినా చాలు" అన్నాడు. మరి ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో చూడాలి.