మరికాస్త వయసు తగ్గించిన మహేశ్ బాబు... థమ్సప్ యాడ్ లో కొత్త లుక్కు

24-07-2021 Sat 14:55
  • థమ్సప్ నూతన యాడ్ షూటింగ్ లో పాల్గొన్న మహేశ్
  • కొత్త హెయిర్ స్టయిల్, ట్రెండీ లుక్ తో సూపర్ స్టార్
  • త్వరలో బుల్లితెరపై సందడి చేయనున్న యాడ్
  • ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం చేస్తున్న మహేశ్
Mahesh Babu new look in Thums Up ad film

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వయసును అంచనా వేయడం చాలాకష్టం! ఆయన తన శరీర సౌష్టవాన్ని ఆ విధంగా మెయింటైన్ చేస్తుంటారు. తాజాగా థమ్సప్ కొత్త యాడ్ చూస్తే, వయసు మరికాస్త తగ్గించుకున్నారా అనేంతగా యంగ్ లుక్ లో దర్శనమిచ్చారు.

చేతిలో ఖాళీ థమ్సప్ సీసాతో, డిఫరెంట్ హెయిర్ స్టయిల్ తో ఉన్న మహేశ్ బాబును చూస్తే "స్టయిలిష్" అనకుండా ఉండలేరు. సరిగ్గా చెప్పాలంటే, టీనేజ్ లో ఉన్న తన కుమారుడు గౌతమ్ తో పోటీ పడేలా ఫ్రెష్ గా కనిపిస్తున్నారు. కాగా, ఈ యాడ్ త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనుంది.
ప్రస్తుతం మహేశ్ బాబు సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు పరశురాం దర్శకుడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా పట్టాలెక్కిస్తాడని తెలుస్తోంది. రాజమౌళితోనూ ఓ సినిమా చేసేందుకు మహేశ్ సిద్ధంగా ఉన్నాడని టాక్ వినిపిస్తోంది.