Bollywood: అవి పోర్న్​ సినిమాలు కాదు.. కేవలం శృంగార చిత్రాలే: శిల్పా శెట్టి

Shilpa Shetty Says Her Husband Used to Make Erotica Not Porn
  • ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులకు వివరణ
  • ఆరు గంటల పాటు విచారణ
  • రెండూ వేర్వేరని చెప్పిన బాలీవుడ్ నటి
పోర్న్ సినిమా నిర్మాణాల్లో తనకు ఎలాంటి ప్రమేయం లేదని బాలీవుడ్ నటి శిల్పా శెట్టి తెలిపింది. తన భర్త రాజ్ కుంద్రా తీసేది పోర్న్ కాదని, కేవలం శృంగార చిత్రాలేనని చెప్పింది. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఆమెను ఆరు గంటల పాటు విచారించారు. ఆ విచారణలోనే ఆమె ఈ విషయాలు వెల్లడించింది.

హాట్ షాట్స్ అనే యాప్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె వివరణ ఇచ్చింది. ఆ యాప్ తో తనకు లావాదేవీలు లేవని, యాప్ లాభాలూ తాను తీసుకోలేదని స్పష్టం చేసింది. తన భర్త రాజ్ కుంద్రాకు సంబంధించి పలు విషయాలను వెల్లడించింది. తన భర్త పోర్న్ సినిమాలు తీయడని చెప్పింది. పోర్న్, శృంగార చిత్రాలు వేర్వేరని చెప్పే ప్రయత్నం చేసింది. హాట్ షాట్స్ లో ఉండే కంటెంట్ ఏంటో కూడా తనకు తెలియదని పేర్కొంది.
Bollywood
Shilpa Shetty
Rajkundra
Porn
Erotica

More Telugu News