టీమిండియాతో చివరి వన్డే.. రాణించిన లంక టాపార్డర్

23-07-2021 Fri 22:08
  • కొలంబోలో భారత్, శ్రీలంక మ్యాచ్
  • మొదట బ్యాటింగ్ చేసిన భారత్
  • 225 పరుగులకు ఆలౌట్
  • లక్ష్యఛేదనలో మెరుగైన స్థితిలో లంక
Team India vs Sri Lanka in third ODI

ఇప్పటికే వన్డే సిరీస్ ను కోల్పోయిన ఆతిథ్య శ్రీలంక జట్టు భారత్ తో చివరి వన్డేలో పుంజుకుంది. భారత్ ను తొలుత 225 పరుగులకే ఆలౌట్ చేసిన లంకేయులు... ఆపై బ్యాటింగ్ లోనూ సత్తా చాటడంతో లక్ష్యఛేదనలో మెరుగైన స్థితిలో నిలిచింది.

ఓవర్లు కుదించడంతో లంక లక్ష్యాన్ని 227 పరుగులుగా నిర్దేశించారు. ఓపెనర్ మినోద్ భానుక 7 పరుగులకే వెనుదిరిగినా... మరో ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో (57 బ్యాటింగ్), భానుక రాజపక్స జోడీ స్కోరుబోర్డును ముందుకు ఉరికించింది. రాజపక్స 65 పరుగులు చేసి సకారియా బౌలింగ్ లో అవుటయ్యాడు.

ప్రస్తుతం శ్రీలంక స్కోరు 23 ఓవర్లలో 2 వికెట్ నష్టానికి 144 పరుగులు కాగా, ఆ జట్టు విజయం సాధించాలంటే ఇంకా 83 పరుగులు చేయాల్సి ఉంది. వర్షం పడడంతో ఓవర్లను 47కి కుదించిన సంగతి తెలిసిందే.