అన్నయ్యను నిర్మాతగా చూడటం గర్వంగా ఉంది: అల్లు అర్జున్

23-07-2021 Fri 17:00
  • సినీ నిర్మాతగా మారిన అల్లు బాబి
  • అల్లు ఎంటర్టైన్మెంట్స్ ను బాబి చేతిలో పెట్టిన అరవింద్
  • వరుణ్ తేజ్ తో తొలి సినిమాను నిర్మిస్తున్న బాబి
Proud to see my brother as producer says Allu Arjun

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబి నిర్మాతగా తన కెరీర్ ను ప్రారంభించాడు. అల్లు బాబి అసలు పేరు అల్లు వెంకటేశ్. అరవింద్ మరో ఇద్దరు కుమారులైన అల్లు అరవింద్, అల్లు శిరీశ్ లు హీరోలుగా కొనసాగుతున్నారు. అల్లు బాబికి నటనపై ఆసక్తి లేకపోవడంతో తండ్రి ఆయనను పెద్ద నిర్మాతగా మలిచేందుకు కృషి చేస్తున్నారు. అల్లు ఎంటర్టైన్మెంట్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి... దాన్ని బాబి చేతిలో పెట్టారు.

ఈ బ్యానర్ కింద తన తొలి చిత్రాన్ని 'గని' పేరుతో బాబి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. మరోవైపు తన అన్నయ్యతో దిగిన ఫోటోను అల్లు అర్జున్ షేర్ చేశాడు. 'గని' సెట్స్ వద్ద ఈ ఫొటోను వీరు దిగారు. 'షూటింగులో ఒక ప్రొడ్యూసర్ గా నా అన్నయ్య అల్లు బాబిని చూడటం చాలా గర్వంగా ఉంది. నిర్మాతగా  ఆయన ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది' అని అర్లు అర్జున్ ట్వీట్ చేశాడు.