Prakasam Barrage: కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు... ప్రకాశం బ్యారేజీకి చేరుతున్న వరద నీరు

Flood water arrives at Prakasam Barrage
  • మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు
  • తెలుగు రాష్ట్రాల్లోనూ సమృద్ధిగా వర్షాలు
  • ప్రకాశం బ్యారేజి ఇన్ ఫ్లో 61,311 క్యూసెక్కులు
  • లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఏపీల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నది వరద రూపు దాల్చింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు జలాశయాలు నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. దాంతో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు.

ఈ క్రమంలో, విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజీ మొత్తం నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 61,311 క్యూసెక్కులు కాగా, 10 గేట్లను 2 అడుగుల మేర ఎత్తారు. మరో 60 గేట్లను 1 అడుగు మేర ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఔట్ ఫ్లో 59,750 క్యూసెక్కులుగా ఉంది. గేట్లను ఎత్తినందువల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Prakasam Barrage
Flood Water
Krishna River
Vijayawada
Rains

More Telugu News