Tokyo Olympics: ఒలింపిక్స్ విశ్వక్రీడా సంబరాలు నేడే ప్రారంభం.. పసిడిపై గురిపెట్టిన పీవీ సింధు

  • కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన క్రీడలు
  • బరిలోకి 206 దేశాలకు చెందిన 11,300 అథ్లెట్లు
  • భారత్ నుంచి 120 మంది క్రీడాకారులు
  • వీరిలో నలుగురు తెలుగు తేజాలు
Tokyo Olympics Starts today

విశ్వక్రీడా సంబరమైన ఒలింపిక్స్ కు నేడు తెరలేవనుంది. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది జరగాల్సిన క్రీడలు వాయిదా పడగా ఎట్టకేలకు నేడు ప్రారంభం కానున్నాయి. నిజానికి కరోనా వేళ ఒలింపిక్స్ నిర్వహణపై విమర్శలు వస్తున్నప్పటికీ ఎలాగైనా నిర్వహించాలన్న గట్టి పట్టుదలతో ఉన్న జపాన్.. పకడ్బందీ చర్యలు తీసుకుంది. నేడు క్రీడలను ఆరంభించి తన సంకల్పాన్ని చాటనుంది.

మొత్తం 206 దేశాలకు చెందిన 11,300 మంది క్రీడాకారులు వివిధ అంశాల్లో పోటీ పడనున్నారు. భారత్ నుంచి 120 మంది వివిధ క్రీడాంశాల్లో ప్రాతినిధ్యం వహించనున్నారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో భారత బృందం ఒలింపిక్స్‌కు వెళ్లలేదు. వీరిలో 68 మంది పురుషులు కాగా, 52 మంది మహిళలు ఉన్నారు. ఆర్చరీ, ఆర్టిస్టిక్, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, బ్యాండ్మింటన్, బాక్సింగ్, ఈక్వెస్ట్రియన్, ఫెన్సింగ్, గోల్ఫ్, హాకీ, జూడో, రోయింగ్, సెయిలింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ వంటి 18 క్రీడాంశాల్లో పోటీపడనున్నారు.

వీరిలో నలుగురు.. పీవీ సింధు, సానియా మీర్జా, సాయి ప్రణీత్, సాత్విక్‌లు తెలుగు తేజాలు. గత ఒలింపిక్స్‌లో రజత పతకం అందుకున్న సింధు..ఈసారి పసిడిపై కన్నేసింది. జపాన్ జాతీయ స్టేడియంలో ఒలింపిక్స్‌ను ప్రారంభించనున్నారు.

More Telugu News