Ramappa Temple: రామప్ప దేవాలయానికి లభించనున్న 'ప్రపంచ వారసత్వ హోదా'.. ఎల్లుండి పారిస్‌లో ఎంపిక కమిటీ సమావేశం

Telangana Ramappa Temple soon going to world heritage sites list
  • రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలంటూ వినతులు
  • యునెస్కోలోని భారత ప్రతినిధికి అన్ని వివరాలు అందజేత
  • 25న ప్రకటించే అవకాశం ఉందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కే క్షణాలు దగ్గరపడ్డాయి. ఈ నెల 25న పారిస్‌లో జరిగే ఎంపిక కమిటీ తుది సమావేశంలో రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించే అవకాశం ఉందని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.

రామప్పను వరల్డ్ హెరిటేజ్‌ సైట్‌గా గుర్తించాలన్న భారత్ వినతులను ఈ కమిటీ పరిశీలించిన అనంతరం ప్రకటించే అవకాశం ఉందని హైదరాబాద్‌లో నిన్న విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు.

రామప్ప ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పటికే యునెస్కోలోని భారత ప్రతినిధికి పంపినట్టు పేర్కొన్నారు. అలాగే, రామప్ప చరిత్రపై ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాన్ని, బ్రోచర్‌లను వారికి అందజేసినట్టు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
Ramappa Temple
Mulugu
Palampet
Telangana
World Heritage

More Telugu News