'డియర్ మేఘ' నాకు చాలా స్పెషల్ : మేఘ ఆకాశ్

22-07-2021 Thu 18:58
  • సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో 'డియర్ మేఘ' 
  • తన పేరుతో ఒక సినిమా వస్తుందని అనుకోలేదన్న మేఘ 
  • తన పాత్ర యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని వ్యాఖ్య   
  • ఇది ఒక అందమైన ప్రేమకథా చిత్రమన్న దర్శకుడు   
Dear Megha is special movie for Megha Akash

మేఘ ఆకాశ్ కథానాయికగా 'డియర్ మేఘ' రూపొందింది. ఈ సినిమాలో ఆమె జోడీగా అరుణ్ ఆదిత్ .. అర్జున్ సోమయాజుల నటించారు. ఈ సినిమాతో దర్శకుడిగా సుశాంత్ రెడ్డి పరిచయమవుతున్నాడు. అర్జున్ దాస్యం నిర్మించిన ఈ సినిమా నుంచి వచ్చిన లిరికల్ వీడియోకి, టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్ వస్తోంది. వచ్చే నెలలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. తాజాగా ఈ సినిమాను గురించి మేఘ ఆకాశ్ మాట్లాడింది.

"ఇది నా పేరుతో వస్తున్న సినిమా .. నా పేరుతో ఒక సినిమా వస్తుందనీ, అందులో నేను యాక్ట్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నిజంగా ఇది నాకు ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం. దర్శక నిర్మాతలు నాపై నమ్మకంతో ఈ పాత్రను ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం నేను మరింత కష్టపడి చేశాను. నా ప్రయత్నం ఫలించిందనే అనుకుంటున్నాను. నా పాత్ర యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాను. ఈ సినిమా నా కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుంది"అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఇక దర్శకుడు మాట్లాడుతూ .. "ఇది ఒక అందమైన ప్రేమకథా చిత్రం. ఎక్కడ ఎలాటి గందరగోళం లేకుండా ప్రేక్షకులకు ఆనందంగా .. ఆహ్లాదంగా అనిపిస్తుంది. కథాకథనాలతో పాటు మాటలు .. పాటలు యూత్ కి బాగా నచ్చుతాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఈ సినిమా మేఘ ఆకాశ్ కెరియర్ కి తప్పకుండా హెల్ప్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలోనే ఉన్నాం" అని అన్నాడు.