Mustafa Raj: చిక్కుల్లో నటి ప్రియమణి వైవాహిక జీవితం... తెరపైకి ముస్తఫారాజ్ మొదటి భార్య

Ayesha made severe allegations on her husband Mustafaraj who married actress Priyamani
  • 2017లో ముస్తఫారాజ్ తో ప్రియమణి పెళ్లి
  • అప్పటికే ముస్తఫారాజ్ కు ఆయేషాతో పెళ్లి
  • ఇద్దరు పిల్లలు కూడా ఉన్న వైనం
  • 2011 నుంచి వేర్వేరుగా ఉంటున్న ముస్తఫా, ఆయేషా

ప్రముఖ నటి ప్రియమణి కొంతకాలం కిందట తమిళనాడుకు చెందిన ముస్తఫారాజ్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడడం తెలిసిందే. అయితే, తాజాగా ముస్తఫారాజ్ మొదటి భార్య ఆయేషా తెరపైకి వచ్చింది. తాము విడాకులు తీసుకోలేదని, ప్రియమణితో తన భర్త రెండో పెళ్లి చెల్లదని  చెబుతోంది. ముస్తఫా, తాను ఇప్పటికీ భార్యాభర్తలమేనని, ప్రియమణితో అతడి పెళ్లి నాటికి తాము విడాకులకు కూడా దరఖాస్తు చేయలేదని స్పష్టం చేసింది.

కాగా, ముస్తఫారాజ్, ఆయేషా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే విభేదాల నేపథ్యంలో 2010 నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. 2017లో ప్రియమణిని ముస్తఫారాజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో, భర్త ముస్తఫా రాజ్ తనను, తన పిల్లలను పట్టించుకోవడంలేదని ఆయేషా తాజాగా ఆరోపించింది.  

ఆమె ఆరోపణలను ముస్తఫా రాజ్ ఖండించాడు. పిల్లల పెంపకానికి అవసరమైన డబ్బును ప్రతి నెలా పంపిస్తున్నానని వివరించాడు. తన నుంచి మరింత డబ్బు తీసుకోవడానికే ఆమె ఈ వ్యాఖ్యలు చేస్తోందని అన్నాడు.

  • Loading...

More Telugu News