అది పోర్న్ కాదు.. వెబ్ సిరీస్ మాత్రమే: రాజ్ కుంద్రా తరపు లాయర్

22-07-2021 Thu 14:59
  • పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్
  • పోలీస్ కస్టడీలో ఉన్న రాజ్ కుంద్రా
  • ఆ వీడియో షూట్ వెబ్ సిరీస్ కి సంబంధించినదన్న న్యాయవాది
Its not porn says Raj Kundras lawyer

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అశ్లీల చిత్రాలను నిర్మించి, వాటిని వివిధ యాప్ ల ద్వారా విడుదల చేస్తున్నారనే ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ప్రస్తుతం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈరోజు ఆయన కేసుకు సంబంధించి కోర్టులో జరిగిన విచారణలో ఆయన తరపు లాయర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

రాజ్ కుంద్రా అరెస్ట్ కు కారణమైన వీడియో షూట్ ఒక వెబ్ సిరీస్ కి సంబంధించినదని సదరు న్యాయవాది అన్నారు. ఆ షూట్ ఓ వెబ్ సిరీస్ మాత్రమే తప్ప పోర్న్ ఫిలిం కాదని చెప్పారు. ఇద్దరు వ్యక్తులు కెమెరా ముందు శృంగారం చేస్తున్నట్టు ఉంటేనే పోర్న్ కిందకు వస్తుందని... అశ్లీల సన్నివేశాలు ఉన్నంత మాత్రాన పోర్న్ కిందకు రాదని అన్నారు.