Sharmila: మీది ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పినందుకు సంతోషం: కేసీఆర్ పై షర్మిల విమర్శలు

Sharmila fires on KCR
  • ఎన్నికల్లో గట్టెక్కేందుకు పథకాలు తీసుకొస్తామని చెప్పినందుకు సంతోషం
  • జనాలను మోసం చేస్తూ గెలుస్తున్నామని చెప్పినందుకు సంతోషం
  • టీఆర్ఎస్ పాలనలో ఎన్నికలు ఉంటేనే పథకాలు వస్తాయి
టీఆర్ఎస్ ఇప్పుడు ఉద్యమ పార్టీ కాదని, పూర్తిగా రాజకీయ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల సెటైర్లు వేశారు. టీఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీ అని కేసీఆర్ చెప్పేశారని అన్నారు. ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఏదో ఒక పథకాన్ని తీసుకొస్తాం తప్ప... ప్రజల అభివృద్ధి మాత్రం మాకు పట్టలేదు అని చెప్పినందుకు చాలా సంతోషం అని ఎద్దేవా చేశారు. జనాలను మోసం చేస్తూ గెలుస్తున్నామని ఇప్పటికైనా చెప్పినందుకు సంతోషమని అన్నారు.

టీఆర్ఎస్ పాలనలో ఎన్నికలు ఉంటేనే పథకాలు వస్తాయని, ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని... ఈ విషయాన్ని ప్రజలు ఇప్పటికైనా గమనించాలని షర్మిల అన్నారు. కాబట్టి మీ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మీ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించండని ప్రజలకు సూచించారు. ఉపఎన్నికలు వస్తే కేసీఆర్ దృష్టి మీ ప్రాంతంపై పడుతుందని... ఎన్నికల్లో గెలిచేందుకు కొత్త పథకాలను తీసుకొస్తారని, ఎన్నికల్లో గెలిచాక హామీలను మళ్లీ మూలకు పడేస్తారని అన్నారు.
Sharmila
YSRTP
KCR
TRS

More Telugu News