హుజూరాబాద్‌లో గెలవలేని పరిస్థితులున్నట్లు కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నట్లు దీని ద్వారా తెలుస్తోంది: విజ‌య‌శాంతి

22-07-2021 Thu 10:18
  • ఎన్నికలలో గెలవాలంటే దళిత బంధు ప్రకటించాలి అని అన్నారు
  • హుజూరాబాద్ లో దళిత బంధు పథకంపై కేసీఆర్ గారి వ్యాఖ్య‌లివి
  • గెలవలేని పార్టీలు హామీలు ఇస్తున్నాయ‌న్నారు
  • వారే ఇయ్యంగ లేంది టీఆర్ఎస్ ఇస్తే తప్పేంది అన్నారు
vijaya shanti slams trs

హుజూరాబాద్ లో ఉప ఎన్నిక జ‌ర‌గాల్సి ఉన్న నేప‌థ్యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన ప‌లు వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. 'హుజూరాబాద్ లో దళిత బంధు పథకంపై కేసీఆర్ గారు మాటలు నవ్వి పోదురు గాక నాకేమి సిగ్గు అన్న చందంగా ఉన్నాయి. ఎన్నికలలో గెలవాలంటే దళిత బంధు ప్రకటించాలి అని చెప్ప‌డం ద్వారా హుజూరాబాద్ లో గెలవలేని పరిస్థితులు ఉన్నట్లు స్వయంగా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది' అని విజయశాంతి విమ‌ర్శ‌లు గుప్పించారు.

'అట్లానే గెలవలేని పార్టీలు హామీలు ఇయ్యంగ లేంది టీఆర్ఎస్ ఇస్తే తప్పేంది అన్నారు. మరి హుజూర్ నగర్, జీహెచ్ఎంసీ, నాగార్జున సాగర్ ఎన్నికల హామీలు యాడపాయ...? తెలంగాణ అంతా దళిత బంధు అమలు చేస్తానంటున్న ఈ ముఖ్యమంత్రి అందుకు నిధులేడకేల్లి కేటాయించునున్నారో చెప్పాలి. ఇంకా కేసీఆర్ గారిని విశ్వసించటమంటే తుపాకీ రాముడు మాటలకు, తుగ్లక్ వాగ్దానాలకు చెవొగ్గే మూర్ఖత్వమే' అని విజయశాంతి ట్వీట్ చేశారు.