Chhattisgarh: అప‌హ‌రించిన ఏడుగురు యువ‌కుల‌ను ఎట్ట‌కేల‌కు విడిచిపెట్టిన మావోయిస్టులు

  • ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో క‌ల‌క‌లం
  • కుందేడ్‌ గ్రామానికి చెందిన యువకుల కిడ్నాప్
  • పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో పాల్గొన్నందుకే?
maoistst releases youth

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో మావోయిస్టులు ఏడుగురు యువ‌కుల‌ను అప‌హ‌రించ‌డం క‌ల‌క‌లం రేపింది. అయితే, ఈ రోజు తెల్ల‌వారుజామున ఆ ఏడుగురు యువ‌కుల‌ను మావోయిస్టులు వ‌దిలేయ‌డంతో వారి కిడ్నాప్‌ క‌థ సుఖాంత‌మైంది.

జగర్‌గుండా ప్రాంతంలోని కుందేడ్‌ గ్రామానికి చెందిన ఏడుగురు యువకులను ఈ నెల 18న కొంతమంది మావోయిస్టులు అప‌హ‌రించారు. వారి కోసం బంధువులంద‌రూ క‌లిసి అడ‌విలో వెతికినా వారి ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. అపహరణకు గురైన యువకులంతా ఇటీవలే పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో పాల్గొన్నారు. అందుకే వారిని మావోయిస్టులు అప‌హ‌రించిన‌ట్లు తెలుస్తోంది. వారు చేసింది మొద‌టి త‌ప్పుగా పేర్కొంటూ వారికి హెచ్చ‌రిక చేసి వ‌ద‌లిపెట్టిన‌ట్లు సమాచారం.

More Telugu News