అశోక్ గజపతిరాజుపై ఆరోపణలు గుప్పిస్తూ.. ప్రధాని మోదీకి విజయసాయిరెడ్డి లేఖ
- 2017లో విజయనగరం వద్ద హీరాకుడ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం
- రైలు పట్టాలు తప్పి 42 మంది మృతి
- ఈ ఘటనపై విచారణ సక్రమంగా జరగకుండా ప్రభావితం చేశారు
- అశోక్ గజపతిరాజుపై అత్యున్నత విచారణ జరిపించాలి
'2017లో విజయనగరం వద్ద హీరాకుడ్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ప్రమాదంలో 42 మంది మృతి చెందారు. ఈ ఘటనపై విచారణ సక్రమంగా జరగకుండా ప్రభావితం చేసిన అప్పటి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుపై అత్యున్నత విచారణ జరిపించాలని ప్రధానమంత్రి మోదీ గారికి లేఖ రాయడం జరిగింది' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.