Telangana ENC: నీటి వాటాలపై కేఆర్ఎంబీకి లేఖ రాసిన తెలంగాణ ఈఎన్సీ

  • తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం
  • కృష్ణా నదీ జలాలపై కొనసాగుతున్న భేదాభిప్రాయాలు
  • 50:50 నిష్పత్తిలో పంచాలన్న ఇంజినీర్ ఇన్ చీఫ్
  • ఏపీని నియంత్రించాలని విజ్ఞప్తి
Telangana ENC wrote KRMB Chairman

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల వివాదం కొనసాగుతోంది. ఇటీవలే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిని కేంద్రం విస్తరించిన నేపథ్యంలో, ఆయా ప్రాజెక్టులు బోర్డు అజమాయిషీలోకి రానున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్) మురళీధర్ రావు కేఆర్ఎంబీకి లేఖ రాశారు. ఇతర పరీవాహక ప్రాంతాలకు కృష్ణా నదీ జలాలను తరలించకుండా ఏపీని నియంత్రించాలని తెలిపారు.

కృష్ణా నదీ జలాలను 50:50 నిష్పత్తిలో పంచాలని కేఆర్ఎంబీ చైర్మన్ ను కోరారు. 2021-22 సీజన్ కు గాను ఈ మేరకు కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేశారు. ట్రైబ్యునల్ నిర్ణయం వెలువడేంత వరకు ఈ నిష్పత్తిని కొనసాగించాలని పేర్కొన్నారు.

More Telugu News