Lands: తెలంగాణలో భూముల విలువను పెంచిన ప్రభుత్వం ... ఉత్తర్వులు జారీ

  • భూముల ధరపై ప్రభుత్వం కీలక నిర్ణయం
  • ఏడేళ్ల తర్వాత రాష్ట్రంలో భూముల ధర పెంపు
  • ధరల పెంపు ఈ నెల 22 నుంచి అమలు
Telangana govt hikes lands rates

తెలంగాణలో భూముల విలువ పెరిగింది. రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ సర్కారు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ధరల పెంపు ఈ నెల 22 నుంచి వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణలో ఏడేళ్ల తర్వాత ధరల సవరణ చేపట్టారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక భూముల ధరల పెంపు నిర్ణయం తీసుకోవడం ఇదే ప్రథమం. బహిరంగ మార్కెట్ లో ధరలకు, ప్రభుత్వ ధరలకు వ్యత్యాసం గుర్తించిన సర్కారు తాజాగా సవరణ చేపట్టింది.

కాగా, పాత ధరలను అనుసరించి రిజిస్ట్రేషన్లకు కొద్ది సమయమే మిగిలుండడంతో రిజిస్ట్రేషన్లు, ఇతర కార్యకలాపాల కోసం ప్రజలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు భారీగా తరలి వస్తున్నారు.

More Telugu News