కేసీఆర్ నూటికి నూరు శాతం దళిత వ్యతిరేకే: మల్లు రవి

20-07-2021 Tue 17:49
  • తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పి మాట తప్పారు
  • ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారు
  • దళిత ఉపముఖ్యమంత్రి రాజయ్యను పదవి నుంచి తొలగించారు
KCR is against to Dalits says Mallu Ravi

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధువు కానే కాదని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. కేసీఆర్ నూటికి నూరు శాతం దళిత వ్యతిరేకే అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పిన కేసీఆర్... ఆ తర్వాత మాట తప్పారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఇతర పథకాలకు మళ్లించారని విమర్శించారు.

దళిత ఉపముఖ్యమంత్రి రాజయ్యను అన్యాయంగా ఆ పదవి నుంచి తొలగించారని మండిపడ్డారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓట్ల కోసమే దళిత సాధికారతపై అక్కడ పైలట్ ప్రాజెక్టుగా స్కీమును ప్రవేశపెట్టారని విమర్శించారు. దళిత బంధువుగా కేసీఆర్ కు క్షీరాభిషేకం చేయడం సరికాదని అన్నారు.