NIA: తెలంగాణలో ఎన్​ఐఏ సోదాలు.. భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం

NIA Raids in 5 districts of Telagana
  • ఐదు జిల్లాల్లోని మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లపై దాడులు
  • డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్, ఐఈడీ సామగ్రి స్వాధీనం
  • మావోయిస్టుల కోసం సిద్ధం చేస్తున్నారన్న అధికారులు
తెలంగాణలోని మావోయిస్టు సానుభూతిపరుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసుకు సంబంధించి రాష్ట్రంలోని జనగామ, భద్రాద్రి, వరంగల్, మహబూబ్ నగర్, మేడ్చల్ జిల్లాల్లో పలువురు మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లపై ఎన్ఐఏ దాడులు చేశారు.

మేడ్చల్ లోని కొమ్మరాజు కనకయ్య, భద్రాద్రిలో గుంజి విక్రమ్, త్రినాథరావు, మహబూబ్ నగర్ జిల్లాలోని ముత్తు నాగరాజు, వి.సతీశ్, వరంగల్ లో వేలుపు స్వామి, జనగామలోని సూర సారయ్యల ఇళ్లలో తనిఖీలు చేశారు.

ఈ సందర్భంగా వారి ఇళ్ల నుంచి 400 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 400 జిలెటిన్ స్టిక్స్ 500 నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 549 మీటర్ల ఫ్యూజు వైర్లను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఐఈడీ, గ్రెనేడ్ లాంచర్ల తయారీ కోసం వాడే సామగ్రి, వాటికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మావోయిస్టులకు వాటిని ఇచ్చేందుకు తీసుకెళ్తుండగా వాటిని పట్టుకున్నామని చెప్పారు.
NIA
Telangana
Maoists
Explosives

More Telugu News