Vijayasai Reddy: హోదాపై నేనిచ్చిన నోటీసును ఈరోజు కూడా రాజ్యసభ ఛైర్మన్ తిరస్కరించారు: విజయసాయిరెడ్డి

RS Chairmen denied my notice on special status says Vijayasai Reddy
  • రూల్-267 కింద ప్రత్యేకహోదాపై చర్చించాలని నోటీసు ఇచ్చాను
  • రెండో రోజు కూడా నా నోటీసును తిరస్కరించారు
  • ప్లకార్డు పట్టుకుని పోడియం వద్ద నిరసన వ్యక్తం చేయాల్సి వచ్చింది
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎంపీలు పార్లమెంటు వేదికగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో ప్రత్యేకహోదాపై చర్చను చేపట్టాలని కోరుతూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడికి విజయసాయిరెడ్డి నోటీసును ఇచ్చారు. రాజ్యసభలో నిర్వహించే ఇతర వ్యవహారాలన్నింటినీ పక్కన పెట్టి రూల్-267 కింద ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై చర్చను ప్రారంభించాలని నోటీసుల్లో కోరారు.

అయితే, కీలకమైన అంశాలు ఉండటంతో ఇప్పుడు దీనిపై చర్చ జరపలేమని వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ అంశంపై విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రత్యేకహోదాపై చర్చ జరపాలని కోరుతూ రాజ్యసభలో ఈరోజు (రెండో రోజు) కూడా నేనిచ్చిన నోటీసును ఛైర్మన్ తిరస్కరించడంతో... ప్లకార్డు పట్టుకుని పోడియం వద్ద నిరసన వ్యక్తం చేయాల్సి వచ్చిందని అన్నారు.
Vijayasai Reddy
YSRCP
Rajya Sabha
AP Special Status

More Telugu News