50 లక్షల ఖర్చుతో 'మాస్ట్రో' స్పెషల్ సాంగ్!

20-07-2021 Tue 11:04
  • 'అంధాదూన్' సినిమాకి 'మాస్ట్రో'
  • ముఖ్యమైన పాత్రలో తమన్నా
  • కీలకమైన పాత్రలో జిషు సేన్ గుప్తా
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు      
Huge budget for Maestro special song

నితిన్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'మాస్ట్రో' సినిమా రూపొందింది. హిందీలో విజయం సాధించిన 'అంధాదూన్' సినిమాకి ఇది రీమేక్. నితిన్ సరసన నాయికగా నభా నటేశ్ నటించగా, హిందీలో 'టబు' చేసిన పాత్రలో తమన్నా కనిపించనుంది. ఇప్పటికే షూటింగును పూర్తిచేసుకున్న ఈ సినిమాను, త్వరలోనే విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను కొత్తగా ప్లాన్ చేశారట. అందులో భాగంగా .. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించిన వారందరిపై ఒక స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేశారు.

ఈ స్పెషల్ సాంగ్ ను ఇటీవల హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో  ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. కేవలం ఈ ఒక్క పాట చిత్రీకరణ కోసం 50 లక్షలు ఖర్చు చేసినట్టుగా చెబుతున్నారు. ప్రమోషన్స్ సమయంలో ఈ పాటను వాడతారట. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, సాంగ్స్ పరంగా ఇప్పటికే మంచి మార్కులను కొట్టేసింది. బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించాడు. నితిన్ ఆశిస్తున్న హిట్ ఈ సినిమాతో పడుతుందేమో చూడాలి.