ఆగస్ట్ నెలకు తిరుమల దర్శన టికెట్ల విడుదల
- రూ. 300 టికెట్లను ఆన్ లైన్లో ఉంచిన టీటీడీ
- రోజుకు 5 వేల టికెట్ల అమ్మకం
- మధ్యాహ్నం 3 గంటలకు అకామడేషన్ స్లాట్స్ విడుదల
పర్యవసానంగా, టీటీడీ వెబ్ సైట్ సర్వర్ డౌన్ అయింది. కాసేపు వెబ్ సైట్లో టికెట్లు కనిపించలేదు. దీంతో టికెట్ల కోసం ప్రయత్నిస్తున్న భక్తులు అయోమయానికి గురయ్యారు. ఆ తర్వాత కాసేపటికి వెబ్ సైట్ ఇబ్బందులు లేకుండా పనిచేసింది. ఆగస్ట్ నెల అకామడేషన్ కు సంబంధించిన స్లాట్ బుకింగ్స్ ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకానున్నాయి. శ్రీవారి దర్శనానికి వచ్చేవారు కోవిడ్ నిబంధనలను పాటించాలని టీటీడీ కోరింది.