అశ్లీల చిత్రాల కేసు.. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త అరెస్ట్

20-07-2021 Tue 09:52
  • అశ్లీల చిత్రాలు నిర్మించి యాప్‌ల ద్వారా విడుదల చేస్తున్నట్టు ఆరోపణలు
  • ఫిబ్రవరిలో కేసు నమోదు చేసిన క్రైం బ్రాంచ్ పోలీసులు
  • ఆరోపణలను ఖండించిన రాజ్ కుంద్రా
Actor Shilpa Shettys Husband Raj Kundra Arrested In Porn Films Case

అశ్లీల చిత్రాలను నిర్మించి యాప్‌ల ద్వారా విడుదల చేస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆరోపణలపై ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఫిబ్రవరిలోనే కేసు నమోదు చేశారు. ఈ కేసులో రాజ్‌కుంద్రానే ప్రధాన కుట్రదారుడిగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని రాజ్‌కుంద్రా పేర్కొన్నారు. శిల్పాశెట్టి- రాజ్‌కుంద్రాలు 2009లో వివాహం చేసుకున్నారు.