జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వేతనాన్ని భారీగా పెంచిన తెలంగాణ సర్కారు

19-07-2021 Mon 19:35
  • పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త
  • ఇప్పటివరకు వేతనం రూ.15 వేలు
  • ఇక నుంచి రూ.28,719కి పెంపు
  • జులై 1 నుంచి వేతన పెంపు వర్తింపు
Salary hike for Junior Panchayat Secretaries in Telangana

తెలంగాణ ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు తీపి కబురు అందించింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల గౌరవ వేతనాన్ని రూ.15 వేల నుంచి రూ.28,719కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ నేడు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ వేతన పెంపు జులై 1 నుంచి వర్తింపజేస్తారని ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాదు, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల అగ్రిమెంట్ గడువును మూడేళ్ల నుంచి నాలుగేళ్లకు పొడిగించింది.