ఇది తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య: మంత్రి నిరంజన్ రెడ్డి

19-07-2021 Mon 18:03
  • నదీ జలాల విషయంలో కేంద్రం ఏకపక్షంగా గెజిట్ జారీ చేసింది
  • అన్ని ప్రాజెక్టులను కేంద్రం తన పరిధిలోకి తీసుకోవడం దారుణం
  • ఒక్క ప్రాజెక్టుకు కూడా కేంద్రం సాయం చేయలేదు
Union govt taking all projetcs in to their hands is not good says Niranjan Reddy

కృష్ణా, గోదావరి నదీ జలాల సమస్య తెలంగాణ ప్రజలకు జీవన్మరణ సమస్య అని టీఎస్ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నదీ జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా గెజిట్ జారీ చేసిందని విమర్శించారు. ఈ గెజిట్ ద్వారా నదులపై ఉన్న అన్ని ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకోవడం దారుణమని అన్నారు. నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సాయం చేయలేదని అన్నారు. అయినప్పటికీ, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం యత్నిస్తోందని.. అయితే ఆ ప్రయత్నాలకు కూడా కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతోందని మండిపడ్డారు.