హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రభావం.. కుప్పకూలిన మార్కెట్లు

19-07-2021 Mon 15:58
  • 586 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
  • 171 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 3.34 శాతం నష్టపోయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు
Sensex looses 586 points

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈనాటి ట్రేడింగ్ ను నష్టాల్లో ప్రారంభించిన మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ స్టాకులు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో సూచీలు డీలా పడ్డాయి.

ప్రైవేట్ సెక్టార్ లో పెద్ద బ్యాంకు అయిన హెచ్డీఎఫ్సీ నికర లాభాలు... కరోనా నేపథ్యంలో అంచనాల కంటే తక్కువగా రావడం ఇన్వెస్టర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతుండటం కూడా మన మార్కెట్లపై ప్రభావాన్ని కనపరిచింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 586 పాయింట్లు పతనమై 52,553కి పడిపోయింది. నిఫ్టీ 171 పాయింట్లు కోల్పోయి 15,752కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (1.89%), నెస్లే ఇండియా (0.59%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (0.27%), సన్ ఫార్మా (0.05%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.04%).  

టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-3.34%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.78%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.15%), యాక్సిస్ బ్యాంక్ (-2.11%), బజాజ్ ఫైనాన్స్ (-1.86%).