తెలంగాణ ఉద్యమకారులను సమర్థించడం అంటే ప్రస్తుతం తెలంగాణను బతికించుకోవటం: విజ‌య‌శాంతి

19-07-2021 Mon 12:07
  • ఈట‌ల‌కు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చెరుకు సుధాకర్ మ‌ద్ద‌తు
  • నియంతృత్వ పాల‌న‌లో తెలంగాణ
  • తిరుగుబాటు పోరాటాలు ముఖ్యం
  • ఉద్యమ ఆకాంక్షల దిశగా భవిష్యత్తు గమనాన్ని సూచించగలగాలి
vijayshanti slams kcr

ప్ర‌తిప‌క్షాల‌ను నిర్వీర్యం చేయాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుట్ర‌లు ప‌న్నార‌ని మాజీ ఎంపీ
కొండా విశ్వేశ్వ‌ర రెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్య‌క్షుడు చెరుకు సుధాక‌ర్ విమ‌ర్శ‌లు గుప్పించిన ఓ వీడియోను బీజేపీ నాయ‌కురాలు విజ‌య శాంతి పోస్ట్ చేశారు. హుజూరాబాద్‌లో బీజేపీ నేత, తెలంగాణ ఉద్య‌మకారుడు ఈటల రాజేంద‌ర్‌కు త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ఆ ఇద్ద‌రు నేత‌లు ప్ర‌క‌టించిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ తెలంగాణలో కొన‌సాగుతోన్న టీఆర్ఎస్ పాల‌న‌పై ఆమె  విమ‌ర్శ‌లు గుప్పించారు.

ధన్యవాదములు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, చెరుకు సుధాకర్ గారు. తెలంగాణ ఉద్యమకారులను సమర్థించడం అంటే ప్రస్తుతం తెలంగాణను బతికించుకోవటం. జన్మంతా జంగ్ చేసి తెచ్చుకున్న తెలంగాణ ఈ రోజు నిరంకుశ, నియంతృత్వ, దొర అధిపత్య పరిపాలన రాజ్య అహంకారానికి  బలైతున్నప్పుడు, ఈ తిరుగుబాటు పోరాటాలే మరోసారి అసలైన ఉద్యమ ఆకాంక్షల తెలంగాణ దిశగా భవిష్యత్తు గమనాన్ని సూచించగలగాలని అభిప్రాయపడుతున్నాను అని విజ‌య‌శాంతి పేర్కొన్నారు.