Parliament: పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం.. లోక్‌స‌భ‌లో విప‌క్షాల ఆందోళ‌న‌

  • విప‌క్షాల‌ ఆందోళ‌న మ‌ధ్యే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌సంగం
  • కొత్త మంత్రుల‌ను ప‌రిచ‌యం చేసిన మోదీ
  • న‌లుగురు కొత్త సభ్యులు లోక్‌సభలో ప్రమాణ స్వీకారం
parliament session begins

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌స‌భ‌లో విప‌క్షాలు ఆందోళ‌న‌కు దిగాయి. వారి ఆందోళ‌న మ‌ధ్యే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌సంగిస్తున్నారు. కొత్త మంత్రుల‌ను ఆయ‌న ప‌రిచ‌యం చేశారు.  ఇటీవల జ‌రిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన న‌లుగురు కొత్త సభ్యులు లోక్‌సభలో ప్రమాణం చేశారు.

తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన వైసీపీ ఎంపీ డాక్టర్‌ గురుమూర్తి లోక్‌సభలో ప్రమాణం చేశారు. ఈ రోజు లోక్‌సభలో ది ఫ్యాక్టరింగ్‌ రెగ్యులేషన్‌ చట్టం, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ ప్రెన్యూర్షిప్, మేనేజ్‌మెంట్ బిల్లుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ స‌మావేశాలు ఆగస్టు 13వరకు జ‌రుగుతాయి.

కాగా, క‌రోనాతో పాటు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవ‌క‌త‌వ‌క‌లు, చైనాతో ప‌రిస్థితులు, దేశంలో నిరుద్యోగం, ఆర్థిక ప‌రిస్థితులు వంటి అంశాల‌పై కాంగ్రెస్ పార్టీ ప్ర‌శ్నించ‌నుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో జ‌ల వివాదం నేప‌థ్యంలో కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసిన‌ గెజిట్ నోటిఫికేష‌న్ అంశాన్ని లేవ‌నెత్తాల‌ని టీఆర్ఎస్ భావిస్తోంది. విభ‌జన చ‌ట్టంలోని పెండింగ్ అంశాల‌ను ప్ర‌స్తావించాల‌ని వైసీపీ నిర్ణ‌యం తీసుకుంది.

More Telugu News