శ్రీలంకతో తొలి వన్డేలో టీమిండియా లక్ష్యం 263 రన్స్

18-07-2021 Sun 19:01
  • కొలంబోలో తొలి వన్డే
  • టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లంక
  • శ్రీలంకతో తొలి వన్డేలో టీమిండియా ముందు సాధారణ లక్ష్యం
  • 50 ఓవర్లలో 9 వికెట్లకు 262 రన్స్
  • టాప్ స్కోరర్ గా చమిక కరుణరత్నే
  • సమష్టిగా సత్తా చాటిన భారత బౌలర్లు
Teamindia restricts Sri Lanka for a normal score

కొలంబోలో టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఆతిథ్య శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. భువనేశ్వర్ కుమార్ విసిరిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో లంక బ్యాట్స్ మన్ చమిక కరుణరత్నే రెండు సిక్సులు బాదడంతో ఆ జట్టు స్కోరు 250 మార్కు దాటింది.

లంక ఇన్నింగ్స్ లో కరుణరత్నేనే టాప్ స్కోరర్. 35 బంతులాడిన కరుణరత్నే 43 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ దసున్ షనక 39, చరిత్ అసలంక 38 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, దీపక్ చహర్ తలో రెండు వికెట్లు తీశారు. పాండ్యా బ్రదర్స్ చెరో వికెట్ పడగొట్టారు.