"అశోక్ బాబాయ్ గారూ..." అంటూ విమర్శనాస్త్రాలు సంధించిన సంచయిత

18-07-2021 Sun 14:28
  • నిన్న మాన్సాస్ కార్యాలయ ముట్టడి
  • ఈవోను నిలదీసిన ట్రస్టు విద్యాసంస్థల సిబ్బంది
  • అశోక్ గజపతే వారిని రెచ్చగొట్టి పంపాడన్న సంచయిత
  • సిగ్గుగాలేదా అంటూ వ్యాఖ్యలు
Sanchaitha once again attacks on her uncle Ashok Gajapathi

విజయనగరంలోని మాన్సాస్ ట్రస్టు కార్యాలయాన్ని నిన్న మాన్సాస్ విద్యాసంస్థల సిబ్బంది చుట్టుముట్టి ఈవోను నిలదీసిన సంగతి తెలిసిందే. చెల్లించాల్సిన జీతాలపై హామీ ఇవ్వాలని వారు పట్టుబట్టారు. దీనిపై మాన్సాస్ ట్రస్టు మాజీ చైర్ పర్సన్ సంచయిత గజపతి స్పందించారు.

"అశోక్ బాబాయ్ గారూ... మీ అన్న గారి పుట్టినరోజున ప్రభుత్వ ఉద్యోగి అయిన మాన్సాస్ ఈవోపైకి సిబ్బందిని రెచ్చగొట్టి పంపించారు" అంటూ ఆరోపించారు. ఆ ఈవో తన రక్షణ కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. ఇలాంటి చర్యలకు మీరు సిగ్గుపడడంలేదా? అంటూ అశోక్ గజపతిరాజును నిలదీశారు. సిబ్బందిని తప్పుదోవ పట్టించి, వారిని రెచ్చగొట్టి ఈవో మీదికి పంపారని సంచయిత మండిపడ్డారు. మీ రాజకీయ చదరంగానికి మాన్సాస్ విద్యాసంస్థలను వాడుకోవద్దు అని స్పష్టం చేశారు.