మ‌హిళ‌ను కింద ప‌డేసి కొట్టిన పోలీసు.. వీడియో వైర‌ల్

18-07-2021 Sun 13:06
  • యూపీలో ఘ‌ట‌న‌
  • ఓ వ్య‌క్తిని అరెస్టు చేసిన పోలీసులు
  • అడ్డుకున్న అత‌డి భార్య‌
  • దాడి చేసిన ఎస్సై
police attacks woman

ఓ మ‌హిళ‌ను కింద ప‌డేసి దారుణంగా కొట్టాడు ఓ ఎస్సై. మ‌హిళ అని కూడా చూడకుండా ఆమె ప‌ట్ల ఎస్సై ప్ర‌వ‌ర్తించిన తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ అమాన‌వీయ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌ డెహత్‌ జిల్లా దుర్గాదాస్‌పూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన‌ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇటీవ‌ల ఓ వ్య‌క్తిని భోగిన్‌పూర్‌ ఎస్సై మహేంద్ర పటేల్ అరెస్టు చేశాడు. అయితే, ఆయ‌న‌ను విడిచిపెట్టాలంటే లంచం ఇవ్వాల‌ని అడుగుతున్నార‌ని అతని భార్య ఆరోపించింది. ఈ క్ర‌మంలోనే ఆమెను ఎస్సై కొట్టాడు. ఆమెను కింద‌ప‌డేసి, ఆమె మీద కూర్చుని బాదాడు. చివ‌ర‌కు స్థానికులు పోలీసును అడ్డుకోవ‌డంతో విడిచిపెట్టాడు. స్నేహితులతో క‌లిసి శివం యాదవ్ అనే వ్య‌క్తి జూదం ఆడుతున్న కార‌ణంగానే తాము అరెస్టు చేశామ‌ని ఎస్సై అంటున్నాడు.  

అరెస్టు చేయ‌కుండా అతని భార్య ఆర్తి, తల్లి తమను అడ్డుకోవాలని ప్రయత్నించి, త‌మ‌పై దాడి చేశార‌ని చెప్పాడు. నిందితుడు పారిపోయేందుకే పోలీసులను మ‌హిళ‌ అడ్డ‌గించార‌ని ఉన్న‌తాధికారులు భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఎస్సై పటేల్‌ను భోగిన్‌పూర్‌ విధుల నుంచి తప్పించామని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామ‌ని వివ‌రించారు. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌తిప‌క్ష పార్టీలు మండిప‌డుతున్నాయి.