తెలంగాణలో కొత్తగా 729 కరోనా పాజిటివ్ కేసులు

17-07-2021 Sat 20:39
  • గత 24 గంటల్లో 1,15,515 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 71 మందికి కరోనా
  • నారాయణపేట జిల్లాలో కొత్త కేసులు నిల్
  • రాష్ట్రంలో ఐదుగురి మృతి
  • ఇంకా 9,980 మందికి చికిత్స
Telangana sees decline in corona positive cases

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,15,515 కరోనా పరీక్షలు నిర్వహించగా, 729 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 71 కేసులు, కరీంనగర్ జిల్లాలో 65, మంచిర్యాల జిల్లాలో 53, పెద్దపల్లి జిల్లాలో 53, ఖమ్మం జిల్లాలో 52 కేసులు నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 772 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,36,049 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,22,313 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 9,980 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 3,756కి పెరిగింది.