విజయనగరంలో మాన్సాస్ కార్యాలయాన్ని ముట్టడించిన ట్రస్టు కళాశాల ఉద్యోగులు

17-07-2021 Sat 17:17
  • మరోసారి తెరపైకి మాన్సాస్ 
  • తమ వేతనాలు చెల్లించడంలేదన్న ట్రస్టు కాలేజీ ఉద్యోగులు
  • 16 నెలలుగా సగం జీతం ఇస్తున్నారని వెల్లడి
  • ఈ నెల పూర్తిగా ఆపేశారని ఆరోపణ
  • ఈవో చాంబర్లోకి దూసుకెళ్లిన ఉద్యోగులు
Mansas Trust College employees protests at EO chamber

మాన్సాస్ ట్రస్టుకు సంబంధించిన వ్యవహారాలు మరోసారి తెరపైకి వచ్చాయి. విజయనగరంలో మాన్సాస్ కార్యాలయాన్ని ట్రస్టు కళాశాల ఉద్యోగులు ముట్టడించారు. జీతాలు చెల్లించాలంటూ ఆందోళన చేపట్టారు. 16 నెలలుగా సగం జీతాలే ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల పూర్తిగా జీతం నిలిపివేశారని తెలిపారు. జీతాలు నిలిపివేయాలంటూ మాన్సాస్ ట్రస్టు ఈవో బ్యాంకులకు లేఖ రాశారని వారు ఆరోపించారు.

కాగా, మాన్సాస్ కార్యాలయంలోకి ప్రవేశించిన ఉద్యోగులు ఈవో చాంబర్ లోకి చొచ్చుకెళ్లారు. వేతనాల విషయమై ఆయనను నిలదీశారు. మాన్సాస్ కార్యాలయం వద్దకు భారీగా ఉద్యోగులు చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. "వీ వాంట్ జస్టిస్, ఈవో డౌన్ డౌన్" నినాదాలతో వారు హోరెత్తించారు.