Venkatesh Daggubati: 'నారప్ప' నా కెరియర్లోనే ప్రత్యేకం: వెంకటేశ్

Venkatesh said Narappa is a special movie in his carrier
  • అమెజాన్ ప్రైమ్ కి 'నారప్ప' 
  • ఈ నెల 20వ తేదీన విడుదల 
  • ఛాలెంజింగ్ రోల్ అంటున్న వెంకీ
వెంకటేశ్ కథానాయకుడిగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' సినిమా రూపొందింది. తమిళంలో భారీ విజయాన్ని సాధించిన 'అసురన్' సినిమాకి ఇది రీమేక్. సురేశ్ బాబు ... కలైపులి థాను సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను, ఈ నెల 20వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి తాజా ఇంటర్వ్యూలో వెంకటేశ్ మాట్లాడారు. "తమిళంలో 'అసురన్' చూడగానే నాకు బాగా నచ్చేసింది. దర్శకుడు వెట్రి మారన్ ను .. ధనుశ్ ను అభినందించకుండా ఉండలేకపోయాను. కొత్త కథ .. ఛాలెంజింగ్ రోల్ .. నేను చేస్తే బాగుంటుందని భావించాను .. చేశాను.

రీమేక్ సినిమాలలో చేయడం చాలా ఈజీ అని చాలామంది అనుకుంటారు ... కానీ అదే కష్టం. హిట్ అయిన ఒక కథను మళ్లీ నా బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా మార్చుకుని, మళ్లీ హిట్ చేయడం కష్టమైన విషయం. తెలుగులోను ఈ సినిమా చాలా బాగా వచ్చింది .. నటన పరంగా నా కెరియర్లో ది బెస్ట్ ఇచ్చానని అనిపించింది. ఆర్టిస్టులంతా చాలా బాగా చేశారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళుతుంది. నా సినిమా థియేటర్లలో రాకుండా ఓటీటీలో వస్తుండటం నా అభిమానులకు కొంత నిరాశకు గురిచేసింది. పరిస్థితులను అర్థం చేసుకోవలసినదిగా వాళ్లకి చెబుతున్నాను. ఓటీటీలో వస్తున్న నా తొలి సినిమా ఇదే. ఆ రకంగా కూడా ఈ సినిమా నా కెరియర్లో ప్రత్యేకమైనదిగా అనిపిస్తోంది" అని చెప్పుకొచ్చారు.
Venkatesh Daggubati
Priyamani
Srikanth Addala

More Telugu News