Shobha Hymavathi: టీడీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి

Shobha Hymavathi resigns to TDP
  • ఎస్ కోట నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన హైమావతి
  • పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన
  • వైసీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం
ఏపీలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేశారు. విశాఖపట్నం జిల్లా ఎస్ కోట నియోజకవర్గం నుంచి గతంలో ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీలో తనకు తగిన గుర్తింపు లభించడం లేదనే ఆవేదనతో ఆమె పార్టీని వీడారు. టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా ఆమె పని చేశారు.

మరోవైపు ఆమె వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుదారులుగా వ్యవహరిస్తున్నారు. పలువురు నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. తెలంగాణలో కూడా పార్టీకి ఇటీవలే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్ లో చేరారు.
Shobha Hymavathi
Telugudesam
Resign

More Telugu News