Tirumala: తిరుమల ఆలయానికి రూ.800 కోట్ల నష్టం

Tirumala lost Rs 800 Cr income due to Corona
  • తిరుమల ఆదాయంలో కరోనా ప్రభావం
  • కరోనా వల్ల 84 రోజుల పాటు భక్తులను అనుమతించని టీటీడీ
  • దారుణంగా తగ్గిపోయిన హుండీ ఆదాయం
తిరుమలపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. కరోనా వల్ల నెలల పాటు ఆలయంలోకి భక్తులను అనుమతించలేదు. దర్శనాలను అనుమతించిన తర్వాత కూడా పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామి వారి హుండీ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఏడాది కాలంగా ఆలయానికి రూ. 800 కోట్ల నష్టం వాటిల్లిందని టీటీడీ అధికారులు తెలిపారు. 84 రోజుల పాటు భక్తులను అనుమతించకపోవడంతో హుండీ ఆదాయం తగ్గిపోయిందని చెప్పారు. కరోనా భయాల కారణంగా భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో తిరుమలకు రావడం లేదు.
Tirumala
TTD
Income

More Telugu News