'బాహుబలి' వెబ్ సీరీస్ లో నయనతార?

16-07-2021 Fri 21:15
  • తెలుగు సినిమా స్థాయిని పెంచిన 'బాహుబలి'
  • నెట్ ఫ్లిక్స్ కోసం 'బాహుబలి' ప్రీక్వెల్ నిర్మాణం
  • మొత్తం తొమ్మిది ఎపిసోడ్లుగా వెబ్ సీరీస్
  • శివగామి పాత్రలో బాలీవుడ్ నటి వామికా గాబీ
Nayanatara to play key role in Bahubali web series

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి అమాంతం పెంచేసిన సినిమా ఇది. అప్పటి నుంచీ మన స్టార్ హీరోలు నటించే తెలుగు సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా మారిపోయాయి. తెలుగు సినిమాకి అంతటి టర్నింగ్ పాయింటుని ఇచ్చింది బాహుబలి. ఇప్పుడీ బాహుబలి చిత్రానికి ప్రీక్వెల్ గా వెబ్ సీరీస్ రానుంది.
 
'బాహుబలి: బిఫోర్ ది బిగెనింగ్' పేరిట ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కోసం భారీ వ్యయంతో ఈ సీరీస్ ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కాగా, ఇందులో కీలక పాత్రను ప్రముఖ కథానాయిక నయనతార పోషించనున్నట్టు తెలుస్తోంది. ఇదే వాస్తవమైతే, ఇది ఆమెకు తొలి వెబ్ సీరీస్ అవుతుంది. అయితే, ఆమె ఏ పాత్ర పోషిస్తుందనేది ఇంకా వెల్లడి కాలేదు. మరోపక్క శివగామి పాత్రలో బాలీవుడ్ నటి వామికా గాబీ నటించనుంది. ఇది మొత్తం తొమ్మిది ఎపిసోడ్లుగా రూపొందుతుంది.