రోడ్లు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం.. సీఎం జ‌గ‌న్‌కు ర‌ఘురామ లేఖ‌

16-07-2021 Fri 10:09
  • రాష్ట్రంలో రహదారులన్నీ అధ్వానం
  • వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మరమ్మతు పనులు చేపట్టాలి
  • దీనిపై వెంటనే దృష్టి పెట్టాలి   
raghu rama writes letter to jagan

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు న‌వ సూచ‌న‌లు (విధేయ‌త‌తో) పేరుతో ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు ఈ రోజు తొమ్మిదో లేఖ రాశారు. రాష్ట్రంలో రహదారులన్నీ అధ్వానంగా తయారయ్యాయని, వీటి వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు.  వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే వాటికి మరమ్మతు పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆయ‌న సూచించారు.

రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేసేలా గోతులు ఉన్నాయ‌ని, స్తంభాన్ని ప‌ట్టుకుంటే షాక్ కొట్టే ఘ‌ట‌న‌లు జ‌రుగుతాయ‌ని ఆయ‌న చెప్పారు. బ‌తుకు బండి లాగ‌డ‌మే క‌ష్టంగా ఉన్న ఈ రోజుల్లో రోడ్డు మీద బండి తోల‌డం మ‌రీ సంక్లిష్టంగా త‌యారైంద‌ని ఆయ‌న తెలిపారు. రోడ్లు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుంద‌ని దీనిపై దృష్టి పెట్టాల‌ని ఆయ‌న సూచించారు.