జేఈఈ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ మార్పు

JEE Mains exams date postponed
  • నాలుగో విడత పరీక్షల షెడ్యూల్ మార్పు
  • సెప్టెంబర్ 1, 2 తేదీల్లో పరీక్షలు
  • విద్యార్థుల డిమాండ్ మేరకు మార్పు చేశామన్న ధర్మేంద్ర ప్రధాన్
జేఈఈ మెయిన్స్ నాలుగో విడత పరీక్షల షెడ్యూల్ లో మార్పులు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం నాలుగో విడత పరీక్షలు ఆగస్టు 26, 27, 31 తేదీల్లో జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలను సెప్టెంబర్ 1, 2 తేదీల్లో నిర్వహించబోతున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

అంతేకాదు, నాలుగో విడత పరీక్షల దరఖాస్తుల గడువును కూడా ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్టు చెప్పారు. నాలుగో విడత జేఈఈ మెయిన్స్ పరీక్షలకు ఇప్పటికే 7.32 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్లను దృష్టిలో ఉంచుకునే ఈ మార్పులు చేశామని చెప్పారు. జేఈఈ మెయిన్స్ మూడు, నాలుగో విడత పరీక్షలకు మధ్య నాలుగు వారాల వ్యవధి ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీకి సూచించామని తెలిపారు.
Go Back to Shorts
JEE Mains
4th Session
Date

More Telugu News