సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

16-07-2021 Fri 07:21
  • మరో వెబ్ సీరీస్ చేస్తున్న రాశిఖన్నా 
  • 'ఆదిపురుష్'లో ప్రముఖ టీవీ నటుడు
  • హైదరాబాదులో ఇల్లు కొన్న సోనూసూద్  
Rashikhanna signs for one more web series

*  మిగతా హీరోయిన్లలానే రాశిఖన్నా కూడా వెబ్ సీరీస్ పై ఇప్పుడు బాగా దృష్టి పెట్టింది. ఇప్పటికే రాజ్&డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ఓ వెబ్ సీరీస్ లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో సీరీస్ కూడా ఒప్పుకుంది. సోనీ లివ్ ఓటీటీ కోసం రూపొందే తెలుగు సీరీస్ లో రాశి డిటెక్టివ్ పాత్రను పోషిస్తుందని తెలుస్తోంది. దీనికి సూర్య వంగల దర్శకత్వం వహిస్తాడు.
*  ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆదిపురుష్' చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా ముంబైలో స్టూడియోలో జరుగుతోంది. కాగా, ప్రముఖ హిందీ టీవీ ఆర్టిస్టు వత్సల్ సేథ్ ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. నిన్ననే ఆయన ఈ చిత్రం షూటింగులో జాయిన్ అయ్యాడు.
*  ఇటీవల కరోనా లాక్ డౌన్ సమయంలో తన దాతృత్వంతో రియల్ హీరోగా పేరుతెచ్చుకున్న ప్రముఖ నటుడు సోనూసూద్ హైదరాబాదులో ఓ ఇల్లు కొన్నట్టు తెలుస్తోంది. తెలుగు సినిమాలలో ఎక్కువగా నటిస్తున్నందున ఇక్కడ ఇల్లు ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో బంజారాహిల్స్ ప్రాంతంలో రూ.10 కోట్లతో ఓ ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్టు సమాచారం.