Gazette Notifications: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై రేపు గెజిట్ నోటిఫికేషన్లు

  • నదీ బోర్డుల పరిధిపై రేపు స్పష్టత
  • మధ్యాహ్నం 1.30 గంటలకు గెజిట్ నోటిఫికేషన్లు
  • జల వివాదాల నేపథ్యంలో ప్రాధాన్యత
  • ఏడేళ్ల అనంతరం గెజిట్ నోటిఫికేషన్లు
Gazette notifications on Krishna and Godavari rivers will release tomorrow

కేంద్ర జలశక్తి శాఖ కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ధారిస్తూ రేపు గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. వాస్తవానికి ఈ గెజిట్ నోటిఫికేషన్లను 2014లోనే విడుదల చేయాల్సి ఉండగా, అనేక అవాంతరాలతో ఇన్నాళ్లకు మార్గం సుగమం అయింది. ఇటీవల తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు మరింత ముదరడం కూడా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.

ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టాన్ని అనుసరించి నదీ యాజమాన్యాల బోర్డుల పరిధిని కేంద్ర ప్రభుత్వం మాత్రమే నిర్వచించగలదని కేంద్ర జల్ శక్తి శాఖ తాజాగా పేర్కొంది. ఈ క్రమంలో రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు కేంద్రం కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని వివరిస్తూ గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేయనుంది.

More Telugu News