సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ

15-07-2021 Thu 11:58
  • వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు
  • మోదీకి స్వాగతం పలికిన ఆనందీబెన్ పటేల్, యోగి ఆదిత్యనాథ్
  • పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
PM Narendra Modi Visits Varanasi

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఉత్తరప్రదేశ్‌లో మోదీ నేడు పర్యటిస్తున్నారు. తన సొంత నియోజకవర్గమైన వారణాసికి ఈ ఉదయం చేరుకున్న ప్రధానికి గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా రూ.744 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అలాగే, రూ.839 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. జపాన్ సహకారంతో నిర్మించిన ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ ‘రుద్రాక్ష్’ను మోదీ ప్రారంభిస్తారు.