Raghu Rama Krishna Raju: ఏపీ సీఎం జగన్‌కు మరో లేఖ రాసిన రఘురామరాజు.. ఈసారి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై!

MP Raghu Rama Krishna Raju writes another letter to Jagan
  • 5 శాతాన్ని కాపు సామాజిక వర్గానికి కేటాయించాలని విన్నపం
  • మిగతా ఐదు శాతాన్ని అగ్రకులాల్లోని పేదలకు కేటాయించాలి 
  • ఇలా చేస్తే మిగిలిన వారికీ అభ్యంతరం ఉండదన్న ఎంపీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఆర్థికంగా వెనకబడిన (ఈడబ్ల్యూఎస్) వారికి రిజర్వేషన్లపై రఘురామరాజు లేఖ రాశారు. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతాన్ని కాపు సామాజిక వర్గానికి, మిగతా ఐదు శాతాన్ని అగ్రకులాలలో ఆర్థికంగా వెనుకబడిన వారికి వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ను ఆ లేఖలో కోరారు.

ఇలా చేస్తే మిగిలిన కులాల వారికి కూడా అభ్యంతరం ఉండదన్నారు. దీనిపై మరింత స్పష్టత కోసం న్యాయస్థానాలకు వెళ్తే మనపై విశ్వాసం పెరుగుతుందని రఘురామరాజు అన్నారు.


Raghu Rama Krishna Raju
Jagan
Andhra Pradesh
Letter

More Telugu News