టెన్నిస్ స్టార్ లియాండర్‌ పేస్‌తో బాలీవుడ్ భామ కిమ్‌శర్మ చక్కర్లు!

15-07-2021 Thu 10:35
  • గోవా బీచ్‌లో లియాండర్ పేస్‌తో చక్కర్లు
  • వైరల్ అవుతున్న ఫొటోలు
  •  గతంలో క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో కిమ్ డేటింగ్
Kim Sharma And Leander Paes Loved Up Pics From Goa Vacation

భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్‌తో బాలీవుడ్ భామ కిమ్‌శర్మ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. వీరిద్దరూ కలిసి తాజాగా గోవా బీచ్‌లో తిరుగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలోనూ వీరిద్దరూ పలుమార్లు జంటగా కెమెరాకు చిక్కారు.

తాజాగా, మరోసారి కంటబడడంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని తెలుస్తోంది. తాజాగా వీరు గోవాలోని ఓ హోటల్‌లో బస చేశారు. సింగిల్‌గా ఉన్న ఫొటోలను పోస్టు చేసిన కిమ్‌శర్మ ‘మిస్టర్ పి’ అంటూ పేస్ పేరును వెల్లడించింది.

కిమ్‌శర్మ గతంలో తెలుగులో మగధీర, ఖడ్గం సినిమాల్లో నటించింది. కిమ్ 2007లో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్‌తోనూ డేటింగ్ చేసింది. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. కాగా, 2010లో కెన్యా వ్యాపారవేత్తను పెళ్లాడిన కిమ్ 2016లో అతడి నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కొంతకాలంపాటు నటుడు హర్షవర్ధన్‌రానేతో ప్రేమ కొనసాగింది. ఇప్పుడు లియాండర్‌తో డేటింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, 48 ఏళ్ల మోడల్ రియాతో సహజీవనం చేస్తున్న లియాండర్‌కు ఓ కుమార్తె కూడా ఉంది.