సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

15-07-2021 Thu 07:29
  • 'ఆర్ఆర్ఆర్' కోసం అలియా భట్ పై పాట 
  • షూటింగుకి రెడీ అవుతున్న నాగార్జున
  • ధనుష్, శేఖర్ కమ్ముల ప్రాజక్ట్ అప్ డేట్  
Rich costumes for RRR song shoot

*  రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం కోసం రామోజీ ఫిలిం సిటీలో ఒక పాటను భారీ ఎత్తున చిత్రీకరించనున్నారు. కథానాయిక అలియా భట్ పై చిత్రీకరించే ఈ పాటకు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సెట్స్ కి, కాస్ట్యూమ్స్ కి ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు అవుతోందట.
*  నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందుతున్న విషయం విదితమే. ఇప్పటికే ఓ షెడ్యూలు షూటింగును పూర్తిచేసుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూలు వచ్చే వారం నుంచి హైదరాబాదులో జరుగుతుంది. ఇందులో కాజల్ కథానాయికగా నటిస్తోంది.
*  తమిళ కథానాయకుడు ధనుష్ హీరోగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పని జరుగుతోంది. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది.