రామ్ మూవీలో కీలకపాత్రలో నదియా!

14-07-2021 Wed 17:41
  • నిరాశపరిచిన 'రెడ్'
  •  పెద్దగా గ్యాప్ ఇవ్వని రామ్
  • లింగుసామితో సెట్స్ పైకి 
  • తెలుగు .. తమిళ భాషల్లో విడుదల  
Nadiya in Ram new movie

రామ్ తాజా చిత్రంగా వచ్చిన 'రెడ్' ఆశించినస్థాయిలో ఆడలేదు. అయినా ఆ విషయాన్ని ఆయన లైట్ తీసుకుని, తన తదుపరి సినిమాను పట్టాలెక్కించాడు. తమిళ దర్శకుడు లింగుసామి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైపోయింది. ఫస్టు షెడ్యూల్లోనే కృతి శెట్టి కూడా జాయిన్ కావడం విశేషం. అంతేకాదు ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తున్న 'నదియా' కూడా ఈ షెడ్యూల్లో జాయిన్ అయింది. ఆమె కాంబినేషన్లోని సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమా నుంచి నదియా లుక్ కూడా బయటికి వచ్చింది. హుందాతనంతో కూడిన పాత్రలనే ఆమె ఎక్కువగా చేస్తుందనే సంగతి తెలిసిందే. ఆమె లుక్ చూస్తుంటే ఇది కూడా అలాంటి పాత్రనే అనిపిస్తోంది. అయితే హీరోకి తల్లిగా చేస్తుందా? హీరోయిన్ కి తల్లిగా కనిపించనుందా? అనేది చూడాలి. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ఈ సినిమాను 'సంక్రాంతి' రోజుల్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేస్తుండటం విశేషం. ఈ సినిమా కథాకథనాలు ఒక రేంజ్ లో ఉంటాయని రామ్ చెప్పడం, అందరిలో ఆసక్తిని పెంచుతోంది.