'పుష్ప' ఫస్టు సింగిల్ కి వేళయినట్టే!

14-07-2021 Wed 17:13
  • హైదరాబాద్ లో 'పుష్ప' షూటింగ్ 
  • మారేడుమిల్లిలో చివరి షెడ్యూల్ 
  • 'క్రిస్మస్'కి రిలీజ్ చేసే ఛాన్స్
  • దేవిశ్రీ సంగీతం ప్రత్యేక ఆకర్షణ  
Pushpa movie shooting update

అల్లు అర్జున్ కథానాయకుడిగా 'పుష్ప' సినిమా రూపొందుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. ఈ నెలాఖరువరకూ హైదరాబాద్ లో షూటింగును జరిపి, వచ్చేనెలలో చివరి షెడ్యూల్ ను మారేడుమిల్లిలో జరపనున్నారు. దాంతో ఈ సినిమా ఫస్టు పార్టు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి వచ్చే నెలలో ఫస్టు సింగిల్ ను వదలాలనే ఆలోచనలో ఉన్నారనే టాక్ తాజాగా వినిపిస్తోంది.

సుకుమార్ .. దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా మ్యూజిక్ పరంగా మంచి మార్కులు కొట్టేశాయి. అందువలన సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను 'క్రిస్మస్'కి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

అల్లు అర్జున్ సరసన నాయికగా రష్మిక నటిస్తుండగా, ప్రతినాయకుడిగా ఫాహద్ ఫాజిల్ కనిపించనున్నాడు. మారేడుమిల్లి షెడ్యూల్లో పూర్తిస్థాయిలో ఫాహద్ పాల్గొంటాడని అంటున్నారు. సుకుమార్ ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. ఆ తరువాతనే 'పుష్ప 2' షూటింగ్ మొదలవుతుంది.