అనుష్క సినిమా ఆగిపోయిందట!

Anushka movie stopped
  • 'నిరాశపరిచిన 'నిశ్శబ్దం'
  • లైన్లో లేని తదుపరి ప్రాజెక్టు 
  • నవీన్ పోలిశెట్టితో సినిమా కేన్సిల్  
సాధారణంగా ఒక సంచలన విజయం దక్కిన తరువాత, కథానాయికలు మరిన్ని అవకాశాలను చేజిక్కుంచుకుంటారు. వరుస సినిమాలను ఒప్పుకోవడమే కాకుండా, భారీగా పారితోషికం పెంచేస్తారు. కానీ అనుష్క విషయంలో అందుకు భిన్నంగా జరిగింది. 'బాహుబలి 2' తరువాత ఆమె తన సినిమాల సంఖ్యను తగ్గించింది. 'భాగమతి' .. 'నిశ్శబ్దం' వంటి నాయిక ప్రధానమైన పాత్రలను మాత్రమే చేసింది. 'భాగమతి' బాగానే ఆడింది .. కానీ 'నిశ్శబ్దం' మాత్రం నిరాశపరిచింది. ఆ తరువాత అనుష్క ఏ సినిమాను ఒప్పుకోలేదు.

ఫలానా బ్యానర్లో .. ఫలానా హీరోతో అనుష్క చేయనుందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ కూడా ప్రచారం దగ్గరే ఆగిపోయాయి. ఏ సినిమాను గురించిన ప్రకటన కూడా అధికారికంగా రాలేదు. ఈ నేపథ్యంలోనే నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్ర ధారిగా ఒక సినిమా రూపొందనుందనీ, ఈ సినిమాలో ఆయన ఊహల నాయికగా అనుష్క కనిపించనుందనే టాక్ వచ్చింది.

 యూవీ క్రియేషన్స్ బ్యానర్లో, మహేశ్.పి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనున్నట్టు చెప్పారు. ఆ తరువాత ఈ ప్రాజెక్టు గురించిన ప్రస్తావన ఎక్కడా లేదు. ఇప్పుడేమో ఈ ప్రాజెక్టు కేన్సిల్ అయినట్టుగా చెప్పుకుంటున్నారు. అసలు అనుష్క అంగీకరించిందా? లేదా? అనే విషయం మాత్రం అంతుబట్టని రహస్యమే అయిపోయింది.    
Go Back to Shorts
Anushka Shetty
Naveen Polyshetty
Mahesh

More Telugu News